మంచినీళ్ళు అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి

.. రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడుకు కెసిఆర్ ఏమి చేసిండనే అని ప్రశ్నించే వాళ్ళకు ఒకే ఒక సమాధనం – మంచినీళ్ళు అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్ళారు.మునుగోడు నియోజకవర్గం – చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తాళ్ళసింగారం.  లింగోజీగూడం వార్డు TRS, CPM, CPI ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.70 ఎండ్ల స్వాతంత్య్రంలో ఫ్లోరోసిస్ తో భాదపడి ఈ ప్రాంతంలో పుట్టదమే ఒక శాపంగా బాధపడుతున్న సందర్భంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్రైతుబంధు,  దళిత బంధు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఒప్పించాలని ఆయన కోరారు.టిఆర్ఎస్. సిపి.ఎం. సి.పి.ఐ కార్యకర్తలు పోలింగ్ రోజు వరకు ప్రతిరోజు సమన్యయంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రలోభలకు లొంగకుండా చేజారకుండా చూసుకోవాల్సిన భాద్యత పార్టీ ముఖ్య నాయకులు కార్త్యకర్తలందరిని ఆయన ఉద్భోదించారు.తాళ్ల సింగారం లింగోజీగూడెం లో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 2 వార్డు కౌన్సిలర్ స్వామి గౌడ్2 వ వార్డు TRS అధ్యక్షులు బొంగు నాగేశ్3వ వార్డు TRS అద్యక్షులు సతీష్డి‌వై‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అనగాని వెంకటేశ్వర్లుసి‌పి‌ఎం మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా 2 వ వార్డు సి‌పి‌ఎం కార్యదర్శి ఎర్ర భూషయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.