ఫైనాన్స్ కమిటీలు లేని తెలుగు రాష్ట్రాలు.. అందుకేనా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతి రాష్ట్రం కూడా రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇది అవసరం కూడా. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు చేస్తున్న అప్పులకు లెక్కులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులను కూడా సరైన విధంగా ఖర్చు చేస్తున్నదీ లేనిదీ చూడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత ఫైనాన్స్కమిటీకి ఉంది.అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫైనాన్స్ కమిటీలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. తెలంగాణలో అసలు దీనిని అడుగుతున్న వారు కూడా లేకుండా పోయారు.ప్రజాపద్దుల కమిటీలను ఏర్పాటు చేసినా.. ఏపీలో దీనిని నిర్వీర్యం చేశారనే వాదన ఉంది. తెలంగాణలో అనుకూల పార్టీ నేతను దీనికి చైర్మన్గా నియమించి.. తటస్థం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో ఫైనాన్స్ కమిటీ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. రాజ్యాంగం ప్రకారం ఫైనా న్స్ కమిటీని ఏర్పాటు చేయాలని మూడు నెలల కిందటే హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. తాజాగా మరోసారి టీడీపీ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై స్పందించిన రాష్ట్ర సర్కారు మరో రెండు మాసాల సమయం కోరింది.ఇదిలావుంటే అసలు ఫైనాన్న్ కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ఎందుకంటే.. చేతికి ఎముకలేనట్టుగా అమలు చేస్తున్న పథకాలతో ఏపీ అప్పుల  కుప్పగా మారిపోయింది.దీంతో లెక్కలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇక తెలంగాణలోనూ  దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రెండు రాష్ట్రాల్లో నూ  ఈ కమిటీలు లేకుండా పోయాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదీ.. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి.

Leave A Reply

Your email address will not be published.