రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉదయం 8 దాటినా జనాలు ఇండ్లలోకి రావలంటే భయపడుతున్నారు. పొగమంచు కురుస్తుండటంతో వాహణదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కుమ్రం భీం జిల్లాలోని సిర్పూర్‌లో అతితక్కువగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 10.8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా జామ్‌లో 12.6, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 13.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.కాగా, రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలితీవ్రత గణనీయంగా పెరిగిపోతున్నది. సూర్యుడు వచ్చినప్పటికీ మంచుదుప్పటి వదలడంలేదు. రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు అలర్ట్‌ జారీచేసింది. పొగమంచు కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.