కౌలు రైతుల గోడు పాలకులకు పట్టదా!

- కౌలు రైతుల గోడు పాలకులకు పట్టదా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కౌలు రైతుల గోడు పాలకులకు పట్టదా కవులు రైతులకు కన్నీటి బాధలు రైతు నష్టపోతున్నాడు రాష్ట్రంగానే ఏదో విధంగా వారిని వారికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణా రైతు హక్కుల సదన సమితి రాష్ట్ర  గౌరవాద్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ యాదవ్ పేర్కన్నారు. తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తారన్నారని, సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదని విమర్శించారు. కష్టపడి పంట పండించే రైతులకు రైతుబంధు రాకపోగా కనీసం ప్రభుత్వపరంగా వచ్చే సబ్సిడీలు కూడా అందడం లేదని, కౌలు రైతు ధాన్యం అమ్మినా కూడా నష్టపోవాల్సి వస్తుందన్నారు. తాను పండించిన పంటను అమ్ముకోవాలంటే పట్టాదార్ పాస్ పుస్తకం తప్పనిసరి అవుతుంది. అలాగని తనకు తెలిసిన పట్టాదారు నుండి పాస్ పుస్తకాన్ని తీసుకెళ్లి ధాన్యాన్ని అమ్ముకుంటే అతడు బ్యాంకుల్లో రుణాలు ఉంటే అట్టి రుణ డబ్బును పట్టుకొని మిగతా డబ్బులు అందజేస్తున్నారని ప్రేమ్ సాగర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోలు రైతులకు రుణ అర్హత కార్డులను అందించాలని అన్నారు.. పొలం యజమానులు అగ్రిమెంట్‌ రాసిచ్చిన వారినే కౌలు రైతులుగా అధికా రులు గుర్తిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తమకు రద్దువుతాయన్న భయం తో పొలం యజమానులు కౌలు రైతులకు అగ్రిమెంట్లు రాసివ్వడం లేదు. పొలం యజమాని హామీ పత్రం ఉంటేనే కౌలు రైతులు ఇస్తామని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఇదేకాకుండా రైతుభరోసా, రాయితీ విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, నష్టపరిహారం చాలా మంది కౌలు రైతులకు అందడం లేదన్నారు. అగ్రిమెంటు లేని రైతులను కౌలు రైతులుగా గుర్తించి ఆదుకోవాలని  ప్రేంసాగర్ యాదవ్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.