రష్యా-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తత

 

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 13 నెలలుగా ఈ రెండు దేశాలు నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని మెజారిటీ నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది.
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.
ఉక్రెయిన్ పై రష్యా దండెత్తడాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ వ్యతిరేకిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. రష్యాపై అనేక రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించాయి ఆయా దేశాలన్నీ. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కు అండగా నిలిచాయి. రష్యాను నియంత్రించడంలో తమవంతు సహకారాన్ని అందిస్తోన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు రష్యా దూకుడును నిలువరించడానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.