నవంబర్ 19న థాంక్యూ పీఎం మోడీజీ స్వర్ణ గర్జన

  ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్; జాతీయస్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం సభ్యులు అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలు ఉపయోగపడ్డాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి  ఢిల్లీ ఇంచార్జ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు.ఈ మేరకు నవంబర్ 19న థాంక్యూ పీఎం మోడీజీ స్వర్ణ గర్జన కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ విసి శ్రీ ప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం అందజేసారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమమే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గర్జన థాంక్స్ పి యం మోడీజీ కార్యక్రమం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్ అన్నారు. సోమవారం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్ర కిషోర్ యోజన ద్వారా సంఘ సభ్యుల అభివృద్ధికి పాటుపడిన తెనాలి విజయవాడ విశాఖపట్నం విజయనగరం గాజువాక సంఘాలకు రాష్ట్రంలో 152 సంఘాలు లక్ష 1,72 వేల కుటుంబాలు ఉన్న స్వర్ణకార సంఘాల్లో 25 సంఘాలకు ప్రత్యేకంగా కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ శ్రీరాందాసు అధావాలే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో 26 నూతన జిల్లాల స్వర్ణకార సంఘాల అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.