పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకి, పార్టీ శ్రేణులు అందరికీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

పార్టీ ఆదేశాల మేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి మరీ మునుగోడులో స్థానికంగా ఉంటూ తెరాస సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఇన్చార్జీలకి, వారితో వచ్చిన కార్యకర్తలకి నాయకులకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్ మీడియా వారియర్లకు సైతం పార్టీ తరపున ధన్యవాదాలు

Leave A Reply

Your email address will not be published.