తెలంగాణలో కుల గణన పై క్యాబినెట్ తీర్మానం చేయాలి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఏర్పడిన నూతన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ శనివారం బాగ్ లింగంపల్లి లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు..తెలంగాణ ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు..బీసీలకు గత ప్రభుత్వంలో ఎటువంటి ఆర్థిక సహకారం అందకపోవడంతో బీసీలు ఆర్ధికంగా, రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.. బీసీల కష్టాలను దూరం చేయడానికి బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ఏర్పాటు చేయాల్సిందిగా బీసీ రాజ్యాధికార సమితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు.తెలంగాణాలో కులగణనను నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసి బీహార్ వలే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు తద్వారా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల అవకాశాలను 42 శాతానికి పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ హామీని అమలు పరచడానికి అనుకూలత ఏర్పడుతుందన్నారు.. బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్లకు పాలకమండలి లను ఏర్పాటు చేసి బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.. 9 ఏళ్లుగా నిర్వహణకు నోచుకోని చేతివృత్తుల సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.. అసెంబ్లీ లో బీసీల ప్రాతినిధ్యం అరకొరగా ఉన్న నేపథ్యంలో బీసీలకు నామినేటెడ్ పదవులు కేటాయించి బీసీల రాజకీయ అవకాశాలను పెంపొందించాలని దాసు సురేష్ కోరారు..అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకీకరణ చేసే విషయంలో కాంగ్రెస్ విజయం సాధించిందనీ , గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపడంలో బీసీ రాజ్యాధికార సమితి ముందున్నదననీ తెలిపారు.. గతంలో తాము చేసిన ప్రజా పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నదనీ , కాంగ్రెస్ హయాంలో కొనసాగే ప్రభుత్వంలో బీసీల ఆకాంక్షలు నెరవేరేలా పాలసీల రూపకల్పనకు సంపూర్ణంగా సహకరిస్తామని దాసు సురేష్ తెలిపారు.. చేతివృత్తి ,కులవృత్తిదారులకు,శ్రామిక జీవులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని కోరారు.ప్రతి కొత్త జిల్లాలో బీసీ సాధికారత భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికా సమితి గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న ,వర్కింగ్ ప్రెసిడెంట్ పారసాని దుర్గేష్, మహిళా సెక్రటరీ శ్రీలత, కేంద్ర కమిటీ సభ్యులు బండారు బైద్యనాథ్, సీనియర్ మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పంగ నర్సింహులు యాదవ్,కోషిగ అనికేత్ ,కామిశెట్టి కృష్ణ , దాసు బలరాం, ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.