ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిధి: శాసనసభ ఎన్నికల్లో ప్రచారాన్ని శనివారం అందరికంటే ముందుగా ప్రారంభించి ముందుకు దూసుకు వెళుతుంది. ప్రచారంలో బాన్సువాడ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

మొదటిరోజు బీర్కూరు మండలం తిమ్మాపూర్, బీర్కూరు తాండా, కిష్టాపూర్, చించోలి గ్రామాలలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు
DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామానికి మంజూరు చేసిన అభివృద్ధి పథకాల నిధులు, గ్రామస్థులకు అందుతున్న సంక్షేమ పథకాలను పోచారం తనదైన శైలిలో వివరించారు.
ఈసందర్భంగా జరిగిన ప్రచార సభలలో పోచారం గ మాట్లాడుతూ
నవంబర్ 30న జరిగే పోలింగ్ లో ప్రజలందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఏలా పనిచేస్తున్నాయో ప్రజలకు ఎక్కువగా తెలుసునని
దేశంలో, రాష్ట్రంలో గతంలో పరిపాలించిన పార్టీలు, ప్రజాప్రతినిధులు సరిగ్గా పని చేసి ఉంటే నేడు గ్రామాలలో ఏ సమస్యలు ఉండేవి కావని,
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం లోని ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పనులు చేస్తుందని,
ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన అన్ని పనులకు నిధులు మంజూరు చేశానని, ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజలకు ఎలాంటి సంశయం అక్కర్లేదని, బి ఆర్ ఎస్ పార్టీ గెలుస్తుందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని,
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన రూ.500 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ నిధులలో రూ. 150 కోట్లను దేవాలయాల అభివృద్ధి కోసం మంజూరు చేశానని,
తిమ్మాపూర్ రామాలయం‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిదన్నారు.
గతంలో ఈ తరహాలో ప్రజల అవసరాలు తీర్చితే ఈరోజు అవసరాలు లేకుండ వుండేవని,
నిజాంసాగర్ ఆయకట్టులో రైతులకు ఇబ్బందులు లేకుండా రూ. 150 కోట్లతో కాలువలను ఆధునీకరించడం జరిగిందని,
భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బందులు లేకుండా గోదావరి నీళ్ళు నిజాంసాగర్ లోకి వస్తున్నాయని,
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లలో లేవని,
తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చి గిరిజనులు, బంజారాలకు స్వయం పాలన ఇచ్చామని,
నియోజకవర్గంలో పేదవారికి ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు ఉండడమే నా లక్ష్యమని,
రాష్ట్రంలో అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయ్యాయని,
మిగిలిన పేదలకు మూడు లక్షల రూపాయల గృహలక్ష్మీ పథకంలో ఇంటిని మంజూరు చేస్తానని,
స్వంత స్థలం లేని పేదలకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అందులో గృహలక్ష్మీ ఇంటిని మంజూరు చేస్తానని,
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్షా నూటపదహార్లు ఇస్తున్నారని,
పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా బాన్సువాడ నియోజకవర్గంలో 120 కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో మౌళిక వసతులు మెరుగుపరిచామని, ప్రజలకు అవసరమైన సామాజిక వసతులు కల్పించానని,
గ్రామాలలో గల్లిగల్లికి సిసి రోడ్లు వేయించానని, మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నామని, ఆయన వ్యాఖ్యానించారు. కుల సంఘాలకు ఆత్మీయ భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశానని,
గతంలో రైతులకు కరంటు కష్టాలు ఉండేవి, నేడు 24 గంటల కరంటు సరఫరా అవుతుందని,
రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరాకు పదివేల రూపాయలు రైతుబంధు ఇస్తున్నామని,
దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా పథకంలో ఆ కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు అందుతున్నాయని,
వర్షాలు సరిగ్గా కురవక నిజాంసాగర్ లోకి నీళ్ళు రాకపోతో ఆయకట్టు లోని రైతులకు ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి రావడానికి రూ. 1500 కోట్లతో కాలువ, సొరంగం పనులు జరుగుతున్నాయని,
మంజీర నదిలో నీళ్ళు వృదాగా పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో చెక్ డ్యాం లు నిర్మించడం జరిగిందన్నారు.
ప్రతిపక్షాల నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పథకాలను అమలచేయరని, కానీ ఇక్కడ మాత్రం ప్రజలకు మోచేతికి బెల్లం పెడుతున్నారని ఇతర పార్టీలను ఉద్దేశించి అన్నారు.
కేసీఆర్ 2018 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను వంద శాతం అమలు చేశారని,
సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే ఇలాంటి విజయవంతమైన ఫలితాలు రావడం జరుగుతుందని,
ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగిందని,
రైతుబీమా తరహాలోనే పేదల కోసం “కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా” ను అమలు చేస్తారని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని,
మేనిఫెస్టో ప్రకారం కొత్త ప్రభుత్వంలో ఆసరా పెన్షన్లు ఏటా రూ. 500 పెంచుతూ 2028 నాటికి రూ. 5016 వరకు పెంచడం జరుగుతుందని,
దివ్యాంగులకు ప్రస్తుతం ఉన్న రూ. 4016 ను ఎన్నికలు పూర్తవ్వగానే రూ. 5016 కు, తదుపరి రూ. 6016 కు పెంచుతామని,
అర్హులైన మహిళలు అందరికీ నెలకు రూ. 3000 గౌరవ భృతి అందుతుందని,
రైతుబంధు రూ. 16,000 కు పెంచడం జరుగుతుందని,
రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
గృహలక్ష్మి ఇళ్ళ మంజూరుతో పాటుగా స్వంత స్థలం లేని పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడం,
అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గంలో గురుకులం ఏర్పాటు,
ప్రజలు కోరుకుంటున్నట్లు అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇచ్చి అమ్మకానికి కొనడానికి వీలుగా మార్పు,
పేదలకు రూ. 400 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ,
చెప్పిన పనులను కేసీఆర్ మాత్రమే చేయగలరు, ప్రజలు కేసీఆర్ ను మాత్రమే నమ్ముతారని,
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని,
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరంటు, రైతుబందు, రైతుబీమా ఉండదు. ధాన్యం కొనుగోలు ఉండదన్నారు.
కేసీఆర్ వంటి సమర్ధుడైన ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని,
ప్రతిపక్షాలు అయితే రోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం తన్నులాటలే ఉంటాయని,
నేను గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేశానని, నేను మీకు బాకీ లేనని, మీరే నాకు బాకీ అని ప్రజల నుద్దేశించి అన్నారు.
రాజకీయంగా ఈ ఎన్నికలే నా చివరి ఎన్నికలని,మీరందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ప్రజలను ఈ సందర్బంగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.