ఆక్సిజన్ నిల్వలపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధించేందుకు నిరంతర నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో దీటుగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రజలను కోరారు. క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, టీకాలు వేయించుకోవాలని కోరారు.కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనలను జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మంది నుంచి రాండమ్ శాంప్లింగ్ తీసుకుని పరీక్షలు చేయాలని తెలిపింది. ఈ నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆరోగ్య కేంద్రాలు కోవిడ్-19 విషయంలో ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబరు 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు.

Leave A Reply

Your email address will not be published.