మెడికల్‌ కాలేజీ ల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెడికల్‌ కాలేజీ ల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ వేదికగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. అలాగే గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్రాన్ని ఈటల రాజేందర్‌ కోరిన విషయాన్ని సైతం మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా తెలంగాణకు ఇవ్వకుండా మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకటి, రెండో ఫేజ్‌లో ఒక్క కాలేజీ ఇవ్వలేదని, మూడో ఫేస్‌లో ఇస్తామని చివరకు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ అదే వివక్షను ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడుగలేదని అంటే.. మరొకరు కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందని, అక్కడ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండడంతో మంజూరు చేయలేకపోయామని చెబుతున్నారని గుర్తు చేశారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ? ఎవరు తప్పుదారి పట్టుస్తున్నారు? అంటూ మంత్రి నిలదీశారు.కేంద్రం మెడికల్‌ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్‌ సొంత నిధులతో రాష్ట్రంలో 12 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించారన్నారు. ఈ ఏడాది తొమ్మిది, మరో ఏడాది ఎనిమిది ఇలా జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉండడం వాస్తవం కాదా? అన్నారు. ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనసు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.