పాము కాటుకు గురైన విద్యార్థి పరిస్థితి విషమం

.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ బిచ్కుంద : బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండల కేంద్రంలోనీ బీసీ బాలుర హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సాయి చంద్ అనే విద్యార్థి ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరువకముందే జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గురుకుల హాస్టల్ లో ఉంటు ఆరవ తరగతి చదువుకుంటున్న రాథోడ్ వంశీ పాము కాటుకు గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోకి పాము జొరబడి నిద్రపోతున్న వంశీని కాటు వేసింది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని సిబ్బంది నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో రాథోడ్ వంశీని వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాముకాటు కు గురవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు జంకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.