దేశము అల్లకల్లోలం అయ్యే ప్రమాదమున్నది

.. జి.నిరంజన్ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర రాష్ట్ర రాజ్యాంగ వ్యవస్తల ఘర్షణ ధోరణి, విచారణ సంస్థలు అధికారములో ఉన్న పార్టీల కు కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రములో అరాచక పరిస్తితులకు దారితీస్తుంది. దేశము అల్లకల్లోలం అయ్యే ప్రమాదముందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లో ఉన్న పార్టీలు ఆయా సంస్థల ద్వారా వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రజలు ఎవారికైనా అధికారం కట్టబెట్టినది భాధ్యతాయుతముగా ప్రజా సేవ చేయడానికే గానీ, రాజకీయ కక్షలు తీర్చు కోవడానికి గాదన్నారు. మోడీ హైదరాబాద్ బేగంపేట లో ” అబ్ దేఖ్ లెంగే ” అని బల్ల గుద్ది చెప్పడము, కెసీఆర్ ప్రెస్ మీట్ లో ” మోడీ జీ హే నహీ చలేగా, నహీ చల్నే దేంగే ” ఆనిన తర్వాత వారిద్దరూ ప్రయోగిస్తున్న అస్త్ర శస్త్రాలు విస్మయానికి గురి చేస్తున్నాయని తెలిపారు. శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ ఘోరముగా విపలమవుతున్న తరుణములో న్యాయ వ్యవస్థ జోక్య ము చేసుకుని ఈ అరాచక పోకడలను అరికట్టాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.