దేశానికి బలమైన న్యాయవ్యవస్థ అవసరం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భార‌తీయ న్యాయ‌వ్య‌వ‌స్థ త‌న చ‌ట్టాల‌ను గౌర‌విస్తుంద‌ని, దేశానికి బ‌ల‌మైన‌, వ్య‌క్తిగ‌త‌మైన న్యాయ వ్య‌వ‌స్థ అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోదీఅన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా.. ఆ దేశం న్యాయ‌వ్య‌వ‌స్థ పాత్ర కీల‌క‌మైంద‌న్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ స‌మావేశంలో సీజేఐ డీవై చంద్రచూడ్ కూడా పాల్గొన్నారు. చ‌ట్టాల‌ను రెండు విధాలుగా ప్ర‌జెంట్ చేయాల‌ని, ఒక‌టి లీగ‌ల్ భాష‌లో, మ‌రొక‌టి సామాన్యుడికి అర్ధ‌మ‌య్యే భాష‌లో ఉండేందుకు త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మోదీ అన్నారు. తీర్పుల‌ను ప్రాంతీయ భాష‌ల్లో అందుబాటులోకి తెచ్చినందుకు సుప్రీంకోర్టు సీజే చంద్ర‌చూడ్‌ను మెచ్చుకున్నారు. భార‌త స్వాతంత్య్రోద్య‌మ స‌మ‌యంలో లాయ‌ర్లు కీల‌క పాత్ర పోషించినట్లు మోదీ తెలిపారు. గాంధీ, తిల‌క్‌, సావార్క‌ర్, అంబేద్క‌ర్‌.. అంద‌రూ లాయ‌ర్లే అన్నారు. ప్ర‌జ‌లకు న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కుల గురించి ఈ స‌మావేశం చైత‌న్యం క‌లిగిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.