మునుగోడు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని టిపిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నేషనల్ మీడియాలో కూడా మునుగోడు లో మద్యం డబ్బు పంపిణీ జరిగిందని ఫోటోలతో సహా ప్రసారం అయ్యాయి. దేశంలో మునుగోడు ఎన్నికలు అత్యంత కరుదైన ఎన్నికలు అని నిరూపితం అయ్యింది. ఎన్నికలు సజావుగా జరగాలంటే అధికార పార్టీ, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర లలో అధికారంలో ఉన్న పార్టీలు డబ్బు విచ్చలవిడిగా పంచారు. ఎన్ని ఆధారాలు చూపిన చర్యలు తీసుకోలేదు. మునుగోడు నుంచి ఇతర ప్రాంతాల వాళ్ళను పంపడంలో విఫలం అయ్యారు. అధికారులను సస్పెండ్ చేసిన అక్కడ మార్పు లేదు. డబ్బులు అనేవి మునుగోడు కు ఎలా వచ్చాయి అనేది విచారణ జరపాలని డిమాండ్ చేసారు. ఎన్నికల కమిషన్ కు లేఖ రాశాము. ఎవరు బాధ్యులు అనేది తేల్చి కటిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండు మూడు ఎన్నికల్లో సీనియర్ సిటిజన్ కు ఇంటి నుంచే ఓటు వేసుకునే వేసుకు బాటు కల్పించారు వాటిని కూడా 15000 వేలకు ఒక్కటి అమ్ముకున్నారు. మంత్రి మల్లా రెడ్డి ఓట్లు వేస్తే తన సంస్థల్లో అవకాశం కల్పిస్తాం అని ప్రకటిస్తాడు. నిన్న చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం రావాలని కలలు కంటున్నాడు. డబ్బు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కసాని జ్ఞానేశ్వర్ ను పార్టీలోకి తీసుకున్నాడని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.