కులాంతర వివాహం చేసుకుందని కుటుంబం వెలువేత

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన.. సంచలనంగా మారిన ఓ కుటుంబం వెలివేత.. కులాంతర వివాహం చేసుకుందని..

తరాలు మారుతున్నా.. స్వరాలు పెరుగుతున్నా.. కుల వివక్షకు మాత్రం తెరబడడం లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఓ కుటుంబం వెలివేత సంచలనంగా మారింది.

గంగారం గ్రామానికి చెందిన మహిళ కుటుంబాన్ని గిరిజన సొసైటీ సంఘం వెలేసింది. ఆమె కుటుంబానికి నిత్యవసరాలతోపాటు.. ఎలాంటి సహకారం అందించవద్దంటూ హుకుం జారీ చేసింది. గ్రామానికి చెందిన మహిళకు కు సహకరిస్తే 20 వేల జరిమానా విధిస్తామని తీర్మానించింది. ఇదిలాఉంటే.. 70 ఏళ్ల క్రితం ప్రభుత్వం గిరిజనులకు 150 ఏకరాల భూమి పంపిణీ చేసింది. గిరిజన సొసైటీగా ఏర్పడిన 25 మందికి భూమిని కేటాయించింది.

ఓ మహిళా కుటుంబం కూడా సొసైటీలో సభ్యురాలే. 16 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. కులాంతర వివాహాన్ని ఆమోదించని సొసైటీ.. మహిళా పై కక్షకట్టింది. మహిళకు వారసత్వంగా రావాల్సిన భూమిని ఇవ్వకుండా బయటకు పంపింది. ఇదేం అన్యాయమని అడిగితే ఇష్టానుసారం కొట్టినట్లు ఆరోపించిన మహిళా, తన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు గ్రామ పెద్దలతో భేటీ అయ్యారు. కాగా.. ఈ కుటుంబ బహిష్కరణ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది.

Leave A Reply

Your email address will not be published.