గంగపుత్రుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదు

.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కోవూరి సత్యనారాయణ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాష్ట్రం లోని గంగపుత్రులను ప్రభుత్వం చిన్న చూపు చుస్తున్దని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. రసూల్ పుర లో వృత్తిని ఆదారం చేసుకొని జీవిస్తున్న ఐదువేల మందికి కనీసం ఉండడానికి ఇల్లువైద్యంన్యాయంఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందటం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రసూల్ పుర గంగపుత్ర సంఘం ప్రతినిధులు కోవూరి సత్యనారాయణ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గంగపుత్రపు సంఘం వారికి ప్రభుత్వ ఫలాలు అందే వరకు అలుపెరుగని పోరాటాలు చేయడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్ర సంఘం వారి పట్ల మరియు అణగారిన కులాల పట్ల చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని  హెచ్చరించారు.ప్రజలమైన మేము ఓటు వేసి నాయకులను చట్టసభల్లోకి పంపిస్తే  చట్టసభల్లో మా బాధక సాధకల గురించి మాట్లాడతారని ఆశిస్తేనాయకులైన మంత్రులుఎమ్మెల్యేలు మాత్రం వారి యొక్క స్వలాభాల కోసం మాత్రమే పాటుపడుతున్నారనివిమర్శించారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణగారిన కులాల వారికి సమన్వయ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో న్యాయవాది భగవంతరావురసూల్ పుర గంగపుత్ర సంఘం అధ్యక్షులు బి ఎల్లయ్యజాయింట్ సెక్రటరీ జగన్నర్సింలుఎం రాజుగంగపుత్ర సంఘం సభ్యులు మరియు గంగపుత్ర సంఘం మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.