అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని, గత మార్చిలో వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు హామీ ఇచ్చిన సీఎం మాట నిలబెట్టుకోవాలని తెలంగాణా రైతు హక్కుల సాదన సమితి రాష్ట్ర గౌరవ అద్యక్షులు కొమ్ము ప్రేం సాగర్ యాదవ్ డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారని కొమ్ము ప్రేం సాగర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేసారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల నగదుతోపాటు వచ్చే సీజన్లో పూర్తి సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించాలని ప్రేం సాగర్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అలాగే ఇండ్లు దెబ్బతిన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గత మార్చిలో కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు 10 వేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మాటను వెంటనే నిలబెట్టుకోవాలని ప్రేం సాగర్ యాదవ్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.