టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ తో సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. గతేడాది డిసెంబర్ లో టీఎస్‌పీఎస్‌ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ కు లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. దీంతో వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు, గ్రూప్ – 2 వాయిదాలు వంటి నిర్ణయాలతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. పోలీసు కేసులు, వివాదాలతో టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ దిగజారిపోయింది. రాజీనామా చేయాలన్న డిమాండ్లతో ఛైర్మన్ సహా ఇతర సభ్యులు రాజీనామా చేశారు. అయితే గవర్నర్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఉద్యోగాల భర్తీకి ఆటంకం ఏర్పడింది. తాజా నిర్ణయంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది.

Leave A Reply

Your email address will not be published.