ఆదరాబాదరగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించి అభాసు పాలైన ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగుల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించి నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్నా, ప్రశ్నా పత్రాలు లీకవుతున్నా పట్టించుకొనే నాథుడు లేక అధికారుల ఇష్టారాజ్యం అయ్యిందని ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యం అని , మొదటి సారి గ్రూప్1 ప్రశ్నా పత్రం లీకేజీకి బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రెండవసారి ఆఘమేఘాల మీద ప్రతిష్టకు పోయి ఆదరాబాదరాగా నిర్వహించి ఆభాసు పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ను వెంటనే పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగులను ఎంపిక చేసే సర్వీసు కమీషన్ నిర్లక్ష్యంగా బయోమెట్రిక్ లేకుండా, అదనంగా 258 ఓ.ఎం.ఆర్ షీట్లను చేర్చడం , నోటిఫికేషన్లలో పేర్కొన్న నియమాలను పబ్లిక్ సర్వీసు కమీషన్ పాటించకపోవడం, కోర్టులో తప్పుడు వివరాలతో కౌంటర్ వేయడం వంటి కార్యకలాపాలపై విస్తుపోయిన హైకోర్టు గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును లోక్ సత్తా పార్టీ స్వాగతిస్తుందని ఆయన అన్నారు. ఇకనైనా నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో , తల్లిదండ్రుల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పోటీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి అర్హులైన వారిని ఉద్యోగులుగా నియామకాలు చేపడుతామని, పలు అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పబ్లిక్ సర్వీసు కమిషన్ ను వెంటనే పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరణ చేపడుతామని ప్రజల్లో నమ్మకంవిశ్వాసం కలిగేలా ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని తుమ్మనపల్లి డిమాండ్ చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.