మైదానాలు ఆరోగ్య ఆలయాలు

-   శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  గచ్చిబౌలి లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100మీటర్స్ రన్ “స్ప్రింట్” ఛాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమం కు ముఖ్య అతిధిగా శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హాజరైనారు. ఈ సందర్బంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ క్రీడాకారులు ఏ రంగంలో ఉన్న మిగితా వారికంటే అత్యధిక ఫలితాలు ఆయా ,సంస్థలకు అందిస్తారు అని అన్నారు.క్రీడల ద్వారా మాత్రమే ఆరోగ్యం, ఉత్సాహవంతులైన ప్రతిభావంతులు సమాజానికి లభిస్తారని అన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించిన సీఎం కెసిఆర్ క్రీడా రంగానికి కూడ అండగా నిలిచారాని వివరించారు. నిఖత్ జరిన్, ఈషా సింగ్ తదితర క్రీడాకారులకు రెండు కోట్ల రూపాయల నగదు, కోట్లాది రూపాయల విలువైన ఇళ్ల స్థలాలను సీఎం కెసిఆర్ అందజెసారని అన్నారు. తెలంగాణ రాష్ట్రము లో క్రీడలు వర్ధిల్లిలానే  దృక్పధంతో కెసిఆర్ ప్రభుత్వం చేయూత అందిస్తుందని అన్నారు. ప్రయివేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం, క్రీడాకారులను, క్రీడా అసోసియేషన్ లకు అండగా నిలవాలని కోరారు.   ఈ కార్యక్రమం లో స్లెట్ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి అమరనాథ్ , అర్జున,ద్రోణచార్య అవార్డు గ్రహీతలు రమేష్, శోభ, అథ్లెటిక్ అసోసియేషన్ కి చెందిన ప్రొఫెసర్ రాజేష్, సారంగ పాణి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఈ పోటీల్లో రెండు వేలమంది కి పైగా క్రీడకారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.