నాగోబా జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామం నుంచి 110 మంది మెస్రం వంశస్తులు కంకణం ధరించి జన్నారం మండలం కలమడుగులోని గోదావరి వద్దకు కాలినడకన బయలు దేరారు. వీరు ఐదు మండలాలు, 18 గ్రామాలు , 22 మారుమూల గ్రామాల మీదు గా గోదావరి హస్తినమడుగు వరకు 125 కి మీ ప్రయాణించి 10వ తేదీన గోదావరి వద్ద కు చేరుకుంటారు.హస్తిన మడుగు వద్ద పవిత్ర గోదావరి కి పూజ చేసి గంగా జలాలు సేకరించనున్నారు. ఈనెల 12 న తిరిగి కేస్లాపూర్ కు చేరుకొని 17 న ఇంద్రవెళ్లి మండలంలోని ఇంద్ర దేవి పూజ అనంతరం తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఈ నెల 21న నాగోబా విగ్రహానికి గంగతో జలాభిషేకం అనంతరం జాతర ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. దాదాపు మూడు లక్షల మందికి పైగా వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.