రివాల్వర్ తో కాల్చుకుని అధికార పార్టీ మాస్ లీడర్ ఆత్మహత్య

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్:

రివాల్వర్ తో కాల్చుకుని అధికార పార్టీ మాస్ లీడర్ ఆత్మహత్య, ఏం జరిగింది ?, ఇంట్లోనే !
మహారాష్ట్ర : మాస్ లీడర్ అయిన వ్యక్తికి రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉండటంతో ఆ లీడర్ ప్రభుత్వం నుంచి రివాల్వర్ కు లైసెన్స్ తీసుకుని ఆ రివాల్వర్ ఎప్పుడు అతని దగ్గరే పెట్టుకుంటున్నాడు.

ఉదయం బయటకు వెళ్లిన ఆ నాయకుడు మద్యాహ్నం ఇంటికి వెళ్లాడు. ఇంటిలోని మేడ మీద ఉన్న అతని రూమ్ లోని నుంచి రివాల్వర్ కాల్పుల శభ్దం వినిపించింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూస్తే ఆ లీడర్ కుప్పకూలిపోయి కనిపించాడు. వెంటనే పొలిటికల్ లీడర్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మహారాష్ట్రలో శివసేన రెబల్, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. మహారాష్ట్రలోని బీడ్ సిటీ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా భాగీరథ్ బియాన్ (51) పని చేస్తున్నాడు. సొంత పార్టీ బీజేపీ అధికారంలో ఉండటంతో భాగీరథ్ బియాన్ చాలా బిజీగా ఉంటున్నాడు. మాస్ లీడర్ అయిన భాగీరథ్ బియాన్ బీజేపీ బీడ్ సిటీ సిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

ప్రాణభయంతో రివాల్వర్

మాస్ లీడర్ అయిన భాగీరథ్ బియాన్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా కక్షలు ఉండటంతో ప్రభుత్వం నుంచి రివాల్వర్ కు లైసెన్స్ తీసుకుని ఆ రివాల్వర్ ఎప్పుడు అతని దగ్గరే పెట్టుకుంటున్నాడు. భాగీరథ్ బియాన్ వెంట నిత్యం బీజేపీ కార్యకర్తలతో పాటు అతని వ్యక్తిగతంగా కొందరు వ్యక్తులు తిరుగుతుంటారు.

రివాల్వర్ తో కాల్చుకుని ?

మంగళవారం ఉదయం బయటకు వెళ్లిన భాగీరథ్ బియాన్ మద్యాహ్నం ఇంటికి వెళ్లాడు. ఇంటిలోని మేడ మీద ఉన్న భాగీరథ్ బియాన్ రూమ్ లోని నుంచి రివాల్వర్ కాల్పుల శభ్దం వినిపించింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూస్తే భాగీరథ్ కుప్పకూలిపోయి కనిపించాడు. వెంటనే భాగిరథ్ బియాన్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న బీజేపీ లీడర్

పోలీసుల ప్రాథమిక విచారణలో బీజేపీ లీడర్ భాగీరథ్ బియాన్ అతని ఇంటిలోని మేడ మీద అతని రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది. అయితే అన్ని కోణాల్లో కేసు విచారణ చేస్తున్నామని, భాగీరథ్ ఆత్మహత్యకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని బీడ్ సిటీ పోలీసు కమీషనర్ ఆనంద్ కుమార్ ఠాకూర్ చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.