గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దీనిపై ట్విటర్ వేదికగా కవిత స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టామీదకన్నా దేశ మౌలిక సదుపాయాలమీద దృష్టిపెడితే బాగుండేదన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నామన్నారు. జనవరి 26 లాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అని సెటైర్ వేశారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.