వదశాలకు తరలిస్తున్న ఎద్దులను అడ్డుకున్న అక్క చెల్లెలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూ: పాతబస్తీలో వధశాలకు తరలిస్తున్న ఎద్దులను ఇద్దరు అక్కాచెల్లెళ్లు అడ్డుకున్నారు. వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులను చంపుకు తింటారా అంటూ వాహనాలకు అడ్డుపడ్డారు. ఎద్దులను తరలిస్తున్న వాహనాల బానెట్‌ పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. వాటిని తరలించకుండా అడ్డుపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట్‌లో రెండు వాహనాల్లో ఎద్దులను తరలిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న శ్రీ వనిత మైథిలి, సునితా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎద్దులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. వాటిని స్లాటర్ హౌజ్‌కు తరలించటానికి వీళ్లేదని వాహనం డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న చాలా మంది ముస్లింలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అయినా అక్కాచెల్లెళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు వనిత వాహనం బానెట్‌పై కూర్చోగా.. సునితా వాహనం ముందు భాగంలో అడ్డుగా నిల్చుంది.

చాలా సేపు వారు అలాగే వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు ముస్లింలు వారిని పక్కకు తప్పించి వాహనానికి దారిచ్చారు. ఆ తర్వాత 100కు డయల్ చేయగా పోలీసుల వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి కంప్లైంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్కాచెల్లెళ్లు తాము 2012 నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామని చెప్పారు. చాలా ఆరోగ్యంగా మరో 15 ఏళ్లు వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులను బక్రీద్ పండుగ ఉందని వధించటం తగదని చెప్పారు. తాము ఏ పార్టీకి, మతానికి వత్తాసుగా మాట్లాడటం లేదని.. జీవరక్ష పరమో ధర్మః అనే మాటకు కట్టుబడి గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.