ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. I – ఇండియా, N – నేషనల్, D – డెమొక్రాటిక్, I – ఇంక్లూజివ్, A – అలయెన్స్ (INDIA)గా వర్ణించాయి. తెలుగులో చెప్పాలంటే.. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి. రెండవ రోజయిన మంగళవారం కూటమి పేరుగా ఇండియాను ఖరారు చేశాయి. ఇండియా కూటమి తదుపరి సమావేశం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అనంతరం కీలక నేతలు ప్రసంగించారు. కూటమిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎవరేమన్నారో చూద్దాం..

Leave A Reply

Your email address will not be published.