కేసీఆర్ మూర్ఖత్వంవల్లే మునుగోడు ఎన్నికలొచ్చాయి

.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ప్రజలారా…. టీఆర్ఎస్ గెలిస్తే… దేశమంతా మందు తాగి, పైసలు తీసుకుని టీఆర్ఎస్ కు ఓటేశారని అవమానంగా చూసే ప్రమాదం ఉంది. అదే బీజేపీని గెలిపిస్తే.. మందు, మాంసం, మనీకి లొంగకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికించారనే పేరుతో గల్లా ఎగరేసుకుని తిరిగే అవకాశం ఉంటుంది. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మునుగోడు ప్రజలకు విజ్ఝప్తి చేశారు. మునుగోడు ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రస్తావిస్తే అసెంబ్లీ నుండే గెంటేయించిన వారినే రాజీనామాతో మునుగోడుకు గుంజుకొచ్చిన మొనగాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ మూర్ఖత్వంవల్లే మునుగోడు ఎన్నికలొచ్చాయని, చేనేత కార్మికులు సహా మునుగోడు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలంటే పువ్వు గుర్తుకే ఓటేయాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సభకు బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీమంత్రి బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, సీనియర్ నేతలు జగన్నాథం, కడగంచి రమేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….

• గట్టుప్పల్ లో వార్ వన్ సైడే. మునుగోడు ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ మైండ్ బద్దలు కావాలె.

• రాజగోపాల్ రెడ్డి సింహం. సింగిల్ గానే పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ గుంటనక్కల పార్టీ.

• గట్టుప్పల్ మండలాన్ని సాధించిన వీరులు మీరు. 900 రోజులు ఉద్యమం చేసిన మీరు తెలంగాణ ఉద్యమం మాదిరిగా పవర్ ఫుల్ ఉద్యమం చేసిండు. ఇక్కడ ఉద్యమించిన రోజాను బెదిరించి టీఆర్ఎస్ లోకి తీసుకున్నరు. రోజాకు బీజేపీ తరపున అభినందనలు.

• గట్టుప్పల్ మండల ఏర్పాటు కోసం అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీ బయట మనోహర్ రెడ్డి ఉద్యమించిండు.

• కేసీఆర్ బిడ్డను బతుకమ్మను అంబాసిడర్ చేద్దామనుకుంటే లిక్కర్ అంబాసిడర్ అయ్యింది. కొడుకు ఐటీకి అంబాసిడర్ చేద్దామనుకుంటే డ్రగ్స్ కు అంబాసిడర్ అయ్యిండు,… అల్లుడు లిటిగేషన్ అంబాసిడర్ అయ్యిండు.

• మునుగోడు ఎన్నికల తీర్పుపై దేశవ్యాప్తంగా ఎదురుచూస్తోంది.

• కేసీఆర్… నీ మూర్ఖత్వంవల్లే మునుగోడు ఎన్నికలొచ్చాయి. మునుగోడుకు ఎలాంటి అభివ్రుద్ధి చేయకపోవడంవల్లే రాజీనామా చేయాల్సి వచ్చింది. సమస్యలతో బాధపడుతున్న మునుగోడు ప్రజలను పట్టించుకోలేదు.

• మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే బావ బామ్మర్థులు గెలిచినట్లు. యాడ చూసినా వాళ్లే. బీజేపీ గెలిస్తే రాజగోపాల్ రెడ్డితోపాటు మునుగోడు ప్రజలు గెలిచినట్లు.

• టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.40 వేలు, తులం బంగారం ఇవ్వబోతున్నరు. భూకబ్జాలు, దోపిడీలతో సంపాదించిన సొమ్ము అది. అవన్నీ ప్రజలే సొమ్మే.

• స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ తన సొంత ఇల్లు జల ద్రుశ్యాన్ని టీఆర్ఎస్ కు ఇస్తే.. ఆయనను దారుణంగా క్షోభ పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ బతికి ఉంటే కేసీఆర్ కు ఓటేయొద్దని చెప్పేవారు.

• లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితో సహకర ఎన్నికలు నిర్వహిస్తే… కేసీఆర్ పాలనలో ఆ ఎన్నికలు జరగకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

• చేనేత నూలు, రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇక్కడి కార్మికులకు ఇవ్వకుండా సూరత్ కు అప్పగించిన దుర్మార్గుడు.

• ఎన్ హెచ్ డీపీ కింద చేనేత కార్మికులను ఆదుకున్నది కేంద్రమే. కాటన్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది కేంద్రమే.

• చేనేత కార్మికులు దైవంగా భావించే మగ్గాలపై కాళ్లు పెట్టి అవమానించిన టీఆర్ఎస్ నేతల అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నరు.

• చేనేత కార్మికులను ఏనాడు పట్టించుకోని కేసీఆర్ ఎన్నికలు రాగానే చేనేత బంధుతో మరోసారి మోసం చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చేనేత బంధు ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి.

• గొల్ల కురమలకు గొర్ల పథకం పైసల సొమ్ము డిపాజిట్ చేసినట్లే చేసి ఫ్రీజ్ చేసిన ఘనుడు కేసీఆర్. నేను లేఖ రాయడంవల్లే ఫ్రీజ్ చేశారంటూ టీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నాడు.

• నేను, నా భార్యాబిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా… నేనెప్పుడూ గొర్ల పథకం పైసలు ఆపాలని లేఖ రాయలేదు. దమ్ముంటే కేసీఆర్ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాలే.

• కేసీఆర్ ది ఒకనాడు బిచ్చపు బతుకు. తినడానికి తిండిలేనోడు.. కారు పైసలు కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు తీసుకుపోతుంటే చూసిన వాడు.. 100 కోట్ల తో విమానం ఎట్లా కొన్నాడు? వందల ఎకరాల ఫాంహౌజ్ ఎట్లా కట్టుకున్నాడు? వేల కోట్ల ఆస్తులెలా కూడగట్టాడు.

• ఇక్కడి పేదలు ఇండ్లు లేవు. ఉద్యోగాల్లేవు. ఉపాధి లేదు. ఎస్టీలకు రిజర్వేషన్లు లేవు, పోడు భూములకు పట్టాల్లేవు. ఇన్నాళ్లూ మోసం చేసిన కేసీఆర్ ఎన్నికలు రాంగనే మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమైండు..

• కేసీఆర్… దమ్ముంటే మునుగోడు నియోజకవర్గ అభివ్రుద్ధికి ఏం చేసినవో ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే ఇక్కడ అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోంది. గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. రోడ్లు వస్తున్నయ్.. పెన్షన్లు వస్తున్నయ్..

• ఆనాడు అసెంబ్లీలో మునుగోడు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే గెటవుట్ అంటూ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెంటేయించిన దుర్మార్గుడు కేసీఆర్..

• ఈరోజు రాజీనామా చేసి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరినీ మునుగోడుకు గుంజుకొచ్చిన మొనగాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

• దళిత, బీసీల, మహిళా పక్షపాతి బీజేపీ. 27మంది బీసీలను, 12 మంది దళితులను, 12 మంది మహిళలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదే.. కేసీఆర్ కేబినెట్ ఆయా వర్గాల వారికి ఎంతమందికి చోటిచ్చారో చెప్పాలి.

• తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేసీఆర్ పాలనలోనే జరిగింది.

• తెలంగాణలో పేదలంతా అల్లాడుతున్నరు. కేసీఆర్ పాలనలో తినడానికి తిండిలేక, ఉండటానికి ఇల్లు లేక, బతకడానికి దారిలేక ఏడుస్తున్నరు. టీఆర్ఎస్ కు ఓటేయొద్దని మొర పెట్టుకుంటున్నరు. టీఆర్ఎస్ గెలిస్తే పిసికి

• పేదోళ్ల జీవితాలు మీ చేతుల్లో ఉన్నయ్… కేసీఆర్ పాలనలో తినడానికి తిండిలేక అర్తనాదాలు పెడుతున్నరు. వాళ్లను పిసికి చంపుకుంటారా? టీఆర్ఎస్ ను ఓడించి వారిని కాపాడుకుంటారా? మీరే ఆలోచించండి.

• ఒకనాడు పత్తి ధర 3 వేలుంటే.. ఈరోజు 6 వేలకుపైగా గిట్టుబాటు ధర లభిస్తోంది. ఓపెన్ మార్కెట్ లో ధర రూ.10 వేల కుపైగానే లభిస్తోందంటే అది మోదీ ప్రభుత్వ పాలనే.

• యూరియా, ఎరువులు, పురుగుల మందు పేరుతో పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. 3,200 యూరియా ధర ఉంటే 1700 సబ్సిడీ ఇస్తోంది. ఎకరానికి ఫాస్పెట్ ద్వారా 5 వేలకుపైగా సబ్సిడీ మోదీ ప్రభుత్వం ఇస్తోంది. డీఏపీ అసలు ధర 2,400లు.. అందులో 1200 సబ్సిడీ ఇస్తున్నం. ఎకరానికి 3,630 సబ్సిడీ ఇస్తున్నం. మొత్తంగా చూస్తే ఒక్కో ఎకరానికి రూ.14 వేల 430 ల సబ్సిడీ ఇస్తోంది. పీఎం సమ్మాన్ నిధి పేరిట ఎకరానికి 6 వేలు ఇస్తోంది.

• కానీ కేసీఆర్ మాత్రం ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్. ఒక్కసారి రైతులంతా ఆలోచించండి. ఎవరు నిజమైన రైతు పక్షపాతే బేరీజు వేసుకోండి.

• వాస్తవాలను పక్కనపెట్టి కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న టీఆర్ఎస్ నేతల నైజాన్ని గమనించండి.

• రాష్ట్రంలో జరుగుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. గ్రామాల్లో జరిగే అభివ్రుద్ధి నిధులన్నీ నరేంద్రమోదీ ప్రభుత్వమే ఇస్తోంది. అయినా బీజేపీపై విషం చిమ్మేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.

• మీకు అండగా ఉండే ఏకైక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మీకు ఆపదొస్తే అండగా ఉండే నాయకుడు. టీఆర్ఎస్ అభ్యర్ధి వస్తే మహిళలు తలుపులు వేసుకునే దుస్థితి.

• మీకు సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రగతి భవన్ వెళ్లి మీ దగ్గరకు గుంజుకొచ్చే వ్యక్తి కావాలా? జీ హుజూర్ అంటూ గడీల పాలనకు సలాం చేసే అభ్యర్ధి కావాలా? తేల్చుకోండి.

• గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీ అయ్యింది. పేదలకు న్యాయం జరగాలంటే నన్న బంధ విముక్తి చేయాలని రోదిస్తోంది. గడీలు బద్దలు కొడదాం… మునుగోడులో టీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేద్దాం రండి…

• పొరపాటును టీఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా గెలిపించారని ప్రజల రక్తం తాగే ప్రమాదం ఉంది. ఊళ్లపై పడి దోచుకునే ప్రమాదం ఉంది.

• మునుగోడు ప్రజలారా…. టీఆర్ఎస్ గెలిస్తే… దేశమంతా మందు తాగి, పైసలు తీసుకుని టీఆర్ఎస్ కు ఓటేశారని అవమానంగా చూసే ప్రమాదం ఉంది. అదే బీజేపీని గెలిపిస్తే.. మందు, మాంసం, మనీకి లొంగకుండా ఓటేశారని గల్లా ఎగరేసుకుని తిరిగే అవకాశం ఉంటుంది.

 

బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ….

• గట్టుప్పల్ మండలం ఇచ్చి వెనక్కు తీసుకున్న టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో కసి తీర్చుకోండి.
• రాజకీయాల్లో ఎవరూ హీరోలు కారు. మీరు ఓట్లేసి గెలిపిస్తేనే హీరోలవుతారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుని పవిత్రమైన ఓటుతో ఎవరిని హీరో చేయాలో, ఎవరిని జీరో చేయాలో నిర్ణయం తీసుకోండి.
• అత్యధికంగా బీసీలున్న మండలం ఇది. బీసీలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ ను ఓడించండి.
• మనీ, మద్యం, మాంసం ఏది పంచినా అదంతా ప్రభుత్వ సొమ్మే. అంటే ప్రజలు కట్టిన పన్నుల సొమ్మే. కాబట్టి అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

బాబూ మోహన్ మాట్లాడుతూ….
• మీ ఓటు అణుబాంబు లాంటిది. మీకు అన్యాయం చేసిన వాళ్లకు ఓటునే బాంబుతో సమాధానం చెప్పండి.

Leave A Reply

Your email address will not be published.