రైల్వే స్టేషన్లో పనిచేసే రైల్వే కూలీలను గుర్తించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో రైల్వే స్టేషన్లో పనిచేసే రైల్వే కూలీలను గుర్తించాలని శివసేన్ (ఉద్దవ్ ఠాక్రే)  తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్ డిమాండ్ చేసారు.మే డే పురస్కరించుకొని కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైల్వే కూలీల మే డే ఉత్సవాళ్ళో పాల్గొన్నారు.ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ వాళ్ల కు కనీస వేతనాల కింద నెలల జీతాలు మరియు హెల్త్ కార్డు వారికి రైల్వే క్వార్టర్స్  ఇవ్వాల్సిందిగా ప్రదాన మంత్రి నరీంద్ర మోడికి విజ్ఞప్తి చేసారు.  కూలీలకు రైల్వే సంస్థ నుంచి రైల్వే( బిల్లా ) బ్యాచ్ గుర్తింపుగా ఇస్తారు  కానీ వాళ్లకు కష్టం చేస్తేనే కూలి పని చేస్తేనే  వాళ్లకు డబ్బులు వస్తాయి మీ ద్వారా దయచేసి రైల్వే సంస్థ నుంచి నెలకు 20000 రూపాయలు  జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. భారతీయ రైల్వే సంస్థ  లో 15 లక్షల పైగా పనిచేస్తుంటారు. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయన్నారు. భారతదేశం మొత్తం రైల్వే కూలీలు కనీసం నాలుగు లక్షల మంది ఉంటారు మోడీ జి  దయచేసి రైల్వే కూలీలను వారి కుటుంబాలను ఆదుకోవాలని సుదర్శన్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.