వేగంగా వేయి స్థంబాల గుడి పునర్నిర్మాణం పనులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వేగంగా వేయి స్థంబాల గుడి పునర్నిర్మాణం పనులు పూర్తి చేయాలని, ఆయా పనులు పకడ్బందీగా జరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్ లో బుధవారం వారు వరంగల్ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి, చీఫ్ విప్ మాట్లాడుతూ, చారిత్రక వరంగల్ కు అత్యంత పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన వేయి స్థంబాల గుడి ని తిరిగి అదే స్థాయిలో పునర్ నిర్మాణం చేయాలన్నారు. ఇప్పటికే వివిధ సాంకేతిక కారణాలతో జరిగిన ఆలస్యాన్ని మరిపించే విధంగ వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్కియాలజీ విభాగం కింద ఉండటం, అప్పటి నిర్మాణ కౌశలం సాండ్ టెక్నాలజీ కావడం వల్లనే గాక, ఆయా బరువైన రాళ్ళను కూర్చడం కూడా కొంత ఆలస్యానికి కారణం అని అధికారులు మంత్రి కి, చీఫ్ విప్ కు వివరించారు. అయితే సమస్యలు ఏవైనా అధిగమించాలని మంత్రి చెప్పారు. మార్చి 31, 2023 లోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాలు ఇచ్చారు.

వేయి స్థంబాల దేవాలయం తో పాటు వరంగల్ కోట, జైన మందిరం ల పై కూడా సమీక్ష చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఇచ్చిన కోటి రూపాయలను మాత్రమే గాక, ఇంకా నిధులు అవసరం అయితే సమకూర్చాలని వారు అధికారులను అదేశించారు. వేయి స్థంబాల దేవాలయం, కుడా లాండ్ పూలింగ్ వంటి అంశాలపై కూడా వారి అధికారులకు తగు సూచనలు చేశారు.

ఈ సమీక్షలో… టూరిజం, సాంస్కృతిక శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, drdo లు, పాండురంగ రావు, టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.