రైతు సంక్షేమమే ద్యేయంగా ‘రైతు సంక్షేమ సేవ సంఘం’ ఆవిర్భావం

తెలంగాణా జ్యోతి/ వెబ్ న్యూస్; దేశానికి స్వతంతరం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ,దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్ కు బాటలు వేసిన మాజీ ప్రదాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం పురస్కరించుకొని  ‘జై జవాన్… జై కిసాన్ ‘ అన్న నినాదాన్ని సార్ధకత చేసే దిశలో ‘రైతు సంక్షేమ సేవ సంఘం’ ఆవిర్బవించింది. సంఘం జాతీయ అధ్యక్షులు  డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి అద్యక్షతన జరిగినా ఈ ఆవిర్భావ కార్యక్రమం లో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రైతు నేతలు హాజరైనారు.రైతుల హక్కుల పరిరక్షన,రైతుల సంక్షేమం,సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను మళ్ళించడం,  దేశం ఆర్ధిక సంక్షోభం నుండి గ్రీన్ రివల్యూషన్ కు బాటలు మళ్ళించే దిశలో‘రైతు సంక్షేమ సేవ సంఘం’ ముందుకు వెళుతుందని నేతలు పేర్కొన్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి రైతు హక్కులు, వాటి పరిరక్షన కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు.జాతీయ అధ్యక్షులు  డా.ఎస్. శ్రీనివాస్ రెడ్డి,   రాష్ట్ర అధ్యక్షులు  కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్, ఉపాధ్యక్షులు గుర్రం  నర్సింహులు,, ఉపేందర్ రెడ్డి, జి.ఆంజనేయులు, ఆర్గనైజర్ బి. ఆంజనేయులు,  విశ్వనాధ్ , కనకరాజు, పి కవిత రెడ్డి,  బి.  బాపూజీ, ఎస్కే సుల్తాన, వీరు యాదవ్, అక్బర్, మాణిక్ రావు, ఇరుగు రమేష్  తదితరులు   హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.