అధికార ప్రతినిధుల పాత్ర కీలకమైంది

- వచ్చేది ఎన్నికల ఏడాది క్రియాశీలకంగా పని చేయాలి.. - మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య లతో పాటు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ అధికార ప్రతినిధులు ఎప్పటికప్పుడు స్పందించాలని, అన్ని అంశాలలో లోతైన అవగాహన తో ఉండాలని రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న అరాచక నియంత పాలనపై స్పందించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అధికార ప్రతినిధులు నిరంతరం పని చేయాలని సూచించారు.

ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిన అంశంలో మనం చట్టపరంగా ఉద్యమిస్తున్నామని 4 ఎమ్మెల్యే ల కేసును హైకోర్టు సీబీఐ కి అప్పగించిన నేపత్యంలో మనం కూడా 12 మంది ఎమ్మెల్యేల అంశాలను ప్రజల్లోకి తీస్కెళ్లాలని అన్నారు.

రాబోయేది ఎన్నికల సంవత్సరం అవుతున్నందున అధికార ప్రతినిధులు నిరంతరం అప్రమతంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీస్కెళ్లాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.