ఆకాశమే హద్దుగా అభివృద్ధి లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నదని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అన్నారు. ఎత్తయిన భవనాల నిర్మాణంలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. ముంబై తర్వాత పెద్ద బిల్డింగ్‌లు కట్టడంలో మనమే ముందున్నామని అన్నారు.జంట నగరాల్లో 50-59 అంతస్తులతో ఎత్తయిన భవనాల నిర్మాణం జరుగుతోందని అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. అతి ఎత్తయిన భవనాల ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్లుగా వివరించారు. ఆమోదం పొందిన టాప్‌-10 ఎత్తయిన భవనాల్లో కోకాపేట/నియోపొలిస్‌ ప్రాంతంలోనే ఐదు భవనాల నిర్మాణం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. టాప్‌-10 టాలెస్ట్‌ బిల్డింగ్‌లకు సంబంధించిన ప్రాజెక్టు పేరు, లొకేషన్‌, ఎన్ని అంతస్తులు, అనుమతులు ఎప్పుడు జారీ అయ్యాయి? వంటి వివరాలను కూడా అందులో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.