తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ శాసన మండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈరోజు (జనవరి 11) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.జనవరి 11 నుంచి18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జనవరి 19న నామినేష్ల పరిశీలన జరనుంది. కాగా.. 22 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇక.. జనవరి 29న పోలింగ్‌ జరగనుంది. అదేరోజున సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.వేర్వేరు ఉపఎన్నికలు కావడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మందే రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్ హయాంలో.. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయటంతో.. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఉపఎన్నికలు నిర్వహిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.