22న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు రాష్ట్ర ప్రభుత్వం  వీడ్కోలు

- నూతన గవర్నర్‌ రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు స్వాగతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఈనెల 22న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు రాష్ట్ర ప్రభుత్వం  వీడ్కోలు పలకనుంది. అలాగే అదే రోజు సాయంత్రం నూతన గవర్నర్‌ రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కు స్వాగతం పలికేందుకు అధికారులు కార్యక్రమాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాజిల్లా ఎస్పీ పి.జాషువాజాయింట్ కలెక్టర్ డా.అపరాజిత సింగ్ వివిధ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.కాగా వారం రోజుల క్రితం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ ను నియమించింది. ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛతీస్ఘడ్ రాష్ట్ర గవర్నర్గా బదిలీ చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్‌అరుణాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా త్రివిక్రమ్‌ పట్నాయక్‌జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియాహిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా శివప్రసాద్‌ శుక్లామణిపూర్‌ గవర్నర్‌ అనసూయలడఖ్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రానాగాలండ్‌ గవర్నర్‌గా గణేషన్‌మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్బీహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బి.డి.మిశ్రాను కేంద్రం నియమించింది.

Leave A Reply

Your email address will not be published.