రాజ్యాధికారం ద్వారానే బడుగుబలహీన వర్గాల మనుగడ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హైదరాబాద్ లోని  నల్లకుంట శతాబ్ధి భవనం లో శివసేన్ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ సుదర్శన్ అధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే132వ   వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా శివసేన తెలంగాణ ముఖ్యఅతిథులుగా మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో ఉద్యమాలను ముందుకు నడిపే సమయం ఆసన్నమైందని బడుగుబలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వస్తేనే మనుగడ ఉంటుందని లేని పక్షంలో జాతులే అంతరించే ప్రమాదం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.భారతీయ సామాజిక కార్యకర్తమేధావికుల వ్యతిరేక సామాజిక సంస్కర్తమహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా,అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగుబలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించివారి హక్కుల కోసం పోరాడిసాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసంపేదఅణగారినఅంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  చిన్నారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.