ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ

-   నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు చేసింది. పోల్ వార్ రూం ఇంచార్జ్‌గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అలాగు ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్టార్టజీ టీంను ఏర్పాటు చేసింది. మీడియా స్టార్టజీ టీం ఇంచార్జ్‌గా జాతీయ నేత శ్వేతను నియమించగా.. ఎంపీ ధర్మపురి అర్వింద్, యోగానందకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, చింతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల‌ కోసం ప్రత్యేకంగా 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ ఉండేలా కార్యచరణ రూపొందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Leave A Reply

Your email address will not be published.