బీజేపీ నేతలవి దొంగ ఏడ్పులు

.. మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ నేతలవి దొంగ ఏడ్పులని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని తెలిపారు.  చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మెషిన్ భగీరథ పైలాన్ దగ్గర ఏర్పాటు చేసిన సంఘీభావ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మునుగోడుకు సీఎం కేసీఆర్‌ ఏం చేసిండని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించే వాళ్లకు ఒక్కటే సమాధానం… మంచి నీళ్లు’’ అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ నేతలకు సూచించారు. నల్లగొండ జిల్లా సమస్య పరిష్కారం కోసం మంజూరైన రీజినల్‌ ఫ్లోరైడ్‌ అండ్‌ ఫ్లోరోసిస్‌ మిటిగేషన్‌ సెంటర్‌ ను మోడీ ప్రభుత్వం బెంగాల్‌ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం పరిశోధనా కేంద్రాన్ని కోల్‌కత్తాకు బదిలీ చేశారు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కిన చందంగా బీజేపీ సర్కారు ఉన్నదనున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, చౌటుప్పల్‌లో దీనిని ఏర్పాటు చేయాలని అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.486లో 8.2 ఎకరాల స్థలాన్ని రీజినల్‌ ఫ్లోరైడ్‌ అండ్‌ ఫ్లోరోసిస్‌ మిటిగేషన్‌ సెంటర్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఫ్లోరైడ్‌ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుందని మాటిచ్చి, పైసా సాయం చేయలేదు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చే సరికి మీ సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఫ్లోరైడ్‌ బాధితులను మోసం చేసేలా హామీలు ఇస్తున్నారని అన్నారు. ఫ్లోరోసిస్‌ సమస్యకు మూలాలను అన్వేషించి దాన్ని అంతం చేసేందుకు ఎన్‌ఐఎన్‌ సహా దేశ, విదేశాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఫ్లోరైడ్‌పై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన సమగ్ర కార్యాచరణ నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు.మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు మేలు చేస్తామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.మునుగోడు ఎన్నిక రూపంలో వచ్చిన అవకాశాన్ని బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. మోసం చేసినవారికి కర్రుకాల్చి వాత పెట్టాల ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెనురెడ్డి రాజు. శ్రీనివాస్.ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.