వినియోగదారుల మన్నన తోనే సేవలకు సార్ధకత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వినియోగదారుల మన్నన పొందేలా సేవ లు అందించాలని,అపుడే సేవ కు సార్థకత చేకూరుతుందని వినియోగదారుల వ్యవహారాలుపౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు సోమవారం నాడు ఆయన ఆమనగల్లు లో హెచ్ పి గ్యాస్ ఎజెన్సీ ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..కొందరు వినియోగదారుల కు ఇప్పటికీ ఫోన్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకోవచ్చన్న విషయం తెలియక,ఏజన్సీ కి వచ్చి తీకుకెళ్ళడం లేదా డెలివరీ బాయ్ ల పై ఆధార పడటం జరుగుతోoదన్నారు.9493602222 నంబర్ కు మిస్ కాల్ చేసి కూడా రీ ఫిల్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు.అలాగే వాట్సప్ నంబర్ 9222201122 తో కూడా బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.గ్యాస్ ఏజెన్సీ తో పాటు మంగళ్ పల్లి లో ఉన్న గ్యాస్ సిలిండర్ల గిడ్డంగి ని కూడా రఘునందన్ తనిఖీ చేశారు. సిలిండర్ల ను ఎవరు రవాణా చేస్తారు. రోజు ఎన్ని సరఫరా అవుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.