ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన కేసులో తీర్పు మధ్యాహ్నానికి వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును  సీబీతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే నేడు తీర్పును వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తీర్పును జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.  ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో వివరాలు ఎలా బయటపెడతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్ అవ్వడంపై పిటిషనర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటపెట్టిన ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారని అడుగుతున్నారు.  ఇక, ఈ ఏడాది అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో.. ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి,  నందకుమార్,  సింహాయాజీలను పోలీసులు అరెస్ట్  చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం  సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ తో కాకుండా సీబీఐ విచారణ చేయించాలని  బీజేపీ పిటిషన్ వేసింది. ఇదే కేసులో  మరికొందరు కూడా సిట్ విచారణ కాకుండా సిబీఐ విచారణ కోరుతూ  పిటిషన్లు దాఖలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.