కర్ణాటకలో ప్రజల తీర్పు ప్రత్యామ్నాయం వైపు ఉంది

-  రాష్ట్రంలో బిఆర్ఎస్ కు బిజెపి నే ప్రత్యామ్నాయం  -   బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎన్విఎస్ఎస్  ప్రభాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణాలో ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులు,ఇక్కడ పాలిస్తుంది బిజెపి కాదు బిఆర్ఎస్ అని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తున్నారు.కర్ణాటక ఎన్నికల యొక్క ప్రభావం తెలంగాణా పై ఒక వెళ  ఉంది అని అనుకున్న ,ఆ ఫలితాల యొక్క నేపథ్యంలో ఇక్కడి ప్రజలు తీసుకోబోయే నిర్ణయం ప్రభావితం చేస్తారు అని రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్  ప్రభాకర్ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు

ఏ రకంగా ఆలోచించిన ఏ కోణంలో చూసినా కూడా కర్ణాటకలో ప్రజల తీర్పు ప్రత్యామ్నాయం వైపు ఉంది అన్న మాట వాస్తవం అన్నారు.ఆ ప్రత్యామ్నాయమె ఈ రాష్టంలోబిఆర్ఎస్ కు ఎవరు అనేది ప్రధానాంశం. ఆ విషయాన్ని గురించి పరిశీలిస్తే రెండో  సారి అధికారం లోకి వచ్చిన బిఆర్ఎస్  పాలన పరిపాలన జరిగి ఉపఎన్నికలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు,ప్రజా ఉద్యమాలు, జారీ చేసిన G.O లు. ఇవన్నీ కధనాలు పరిశీలించి రాజకీయంగా విశ్లేషిస్తే ఈ రాష్ట్రంలో ముమ్మాటికి ప్రజలు  కోరుకుంటుంది బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరు అంటే అది బిజెపి నే అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికలే కావచ్చు, GHMC ఎన్నికలే కావచ్చు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పై జారీ చేసినటువంటి GO ల యొక్క నేపథ్యంలో జరిగినటువంటి ఒక ఉద్యమ పోరాటంలో భారతీయ జనతా పార్టీ  అగ్రనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ మొత్తానికి మొత్తంగా ప్రజలకు అండగా ఆ వర్గాలకు బాసటగా ఉండి ప్రతి క్షణం మరు క్షనమ అను క్షణం ఈ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు చూపిస్తూ ,ఆ రకంగా గుండెల్లో నిద్రపోయినటువంటి పార్టీ బిజెపి అని స్పష్టంగా ప్రజల హ్రుదయాలలో నుంచి ,అంతరాలలో నుంచి ,అంతరంగాలలో నుంచి బిజెపి పట్ల ఉన్నటువంటి అనురాగాలు బయట పడుతున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ  అయిన కాంగ్రెస్ గోరంగా శాసనసభలో వైఫల్యం చెందడం .ఇక్కడ శాసనసభలో ఒకరినోకరు ప్రశంసించుకుంటూ కలసి మాట్లాడుకుంటూ నడవటం మనం గమనించ వచ్చు.అక్కడ లోక్సభలో బిజెపిని నిలువరించటానికి బిఆర్ఎస్ కాంగ్రెస్  ఫ్లో కోఆర్డినేషన్ పేరిట లోక్ సభలో కలిసి నడవటం జనం చుసారు .శాసనసభలో కూడా చూసారు.గత సార్వత్రిక, అంతముందు జరిగిన సార్వత్రిక ఎన్నికలు గమనిస్తే ఒక శాసనసభ్యుడు పార్టీ మారితే ఏ స్థాయిలో ఉధ్యమిస్తారో,ఏ స్థాయిలో నిలదీస్తారో ,ఏ స్థాయిలో ప్రశ్నిస్తారో అధినాయకత్వం నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకత్వంతో సహా అక్కడ  ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుల వరకు నిలదియటం నిలవరించటం అనేది ప్రజాస్వామ్యంలో ఈ రోజు వరకు జరిగినటువంటి ఒక విషయం. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఎన్నో సార్లు ఫిరాయింపులు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి  మూకుమ్మడిగా, హోల్ సేల్ గా జరిగినా కూడా ఒక్క రోజు కూడా మాట్లాడని వారు సోనియా,రాహూల్ ఆనాటి నుంచి ఈనాటి వరకు .సిఎల్పి  శాసన మండలి, సిఎల్పి శాసనసభని  విలీనం చేసినప్పుడు కూడా ఎదో మోక్కుబడిగా మాట్లాడినటువంటి నాయకులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.వీళ్ళు ప్రత్యామ్నాయం కాదు అని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాబట్టే ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు ,ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూసారు ఆ రకంగా బిజెపికి బలోపేతం చేయటం కొరకు ఊరూర,గ్రామగ్రామనా తరలి వచ్చినటువంటి ప్రజానీకాన్ని అనేక బిజెపి కార్యక్రమాలలో మనం చూసాము అని తెలిపారు.ఇప్పటికి కూడా కాంగ్రెస్లో సగం మందిని కల్టివేట్ చేస్తుంది ఈ బిఆర్ఎస్  కేసిఆర్.ఆ రకంగా కలిపి ఉంచుతుంది కూడా కేసిఆరే.కాబట్టి  ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాజాలదు భారతీయ జనతా పార్టీనే అని స్పష్టంగా తెలియచేస్తున్నాము.అది ప్రజలలో కూడా అనేక విధాలుగా బయట పడిన విషయం తెలిసిందే.ఒక వేళ కర్ణాటక ఫలితాలే  ప్రభావితం చేస్తాయి అనుకుంటే ఈ ప్రత్యామ్నాయం అనేది ప్రదానంగా కనపడుతుంది.ఆ ప్రత్యామ్నాయ పాత్ర ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు బిజెపి నే ఉంది ఒ రకంగా నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే.కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్ పార్టీలు పగటి కలలు కంటున్నాయి.ఆలోచనలు సమాలోచనలు చేస్తాఉన్నారు ఎందుకంటే వారి వ్యూహకర్తలు ,సిధ్ధాంతకర్తలు ఒక్కరే కాబట్టి.ఇదీ రాజకీయంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని తెలిపారు.

ఇకపోతే కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 21 రోజుల పాటు చేస్తారంట.ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణా ప్రజల్ని ఉద్ధరించారని బాగోగులు చూసారని లేదా ఉద్యమ సమయంలో అనుకున్నది సాదించారన్నట్టుగా వీళ్ళు 21 రోజులపాటు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతామంటున్నారు వీళ్ళకి ఆ రకంగా జరిపేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు అని భారతీయ జనతా పార్టీ పక్షాన పేర్కొన్నారు.నీళ్ళు, నిదులు,నియామకాలే లక్ష్యంగా సాధిస్తే ఈ రాష్ట్రంలో నీళ్ళు నిదులు ,నియామకాల విషయంలో బహిరంగ చర్చకు ఈ 9 సంవత్సరాలకాలంలో ఆ యొక్క నీటి వాట,కోటాపెంపు విషయంలో కావచ్చు నిదులు ,నియామకాల విషయంలో కావచ్చు ఒక్కొక్క అంశంలో బహిరంగచర్చకు వస్తే దోషిగా ఈ బిఆర్ఎస్ పార్టీనే ప్రజలు నిలబెడతారు అని తెలిపారు.నీళ్ళు నిదులు నియామకాలు గాలికి వదిలి ఈ రాష్ట్రంలో పురోగతి సాదించింది అంటే అది అప్పుల్లో,వీరి యొక్క  వ్యాపారాల్లో లీకుల్లొ.నీళ్ళు, నిదులు నియామకాలు పోయి బీరు,అప్పులు ,లీకులకూ ప్రతీకగా ఈ ప్రభుత్వం నిలిచిందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.