తెలంగాణలోనూ మూడు రాజధానులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించిన విమర్శలు ఒకపక్క వినిపిస్తుంటే.. మరోపక్క ఆయన నిర్ణయాల్ని.. ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సమర్థింపు కూడా సాగుతోంది. దీంతో.. ఆయన విధానాలు పూర్తిగా తప్పు అని కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించటం తెలిసిందే.తాను పవర్లోకి వచ్చిన తర్వాత అమరావతే రాజధానిగా జగన్ చెప్పినప్పటకీ.. అధికారం తన చేతికి వచ్చిన తర్వాత మాత్రం ఏపీకి మూడు రాజధానుల కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు.దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోనూ మూడు రాజధానుల డిమాండ్ ను ప్రస్తావిస్తున్నారు ఓయూ న్యాయకళాశాల డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ఐదు కోట్ల ప్రజలకు డెవలప్ మెంట్ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో పరిపాలనా వికేంద్రీకరణకు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మూడు రాజధానుల విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.జగన్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని.. తెలంగాణలో కేవలం హదరాబాద్ మాత్రమే డెవలప్ అవుతుందని.. మిగిలిన అన్నీ ప్రాంతాలు అభివ్రద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ను రాజకీయ రాజధానిగా.. వరంగల్ ను కార్యనిర్వాహక రాజధానిగా.. అదిలాబాద్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణతో పాటు దేశంలోనూ మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న ఆయన.. ”ఢిల్లీని ఉత్తరాది రాజధానిగా.. హైదరాబాద్ ను దక్షిణాది రాజధానిగా.. ఈశాన్య రాజధానిగా కోల్ కతాను ఏర్పాటు చేయాలన్నారు.అలా చేయటం ద్వారా పాలనా పరమైన సౌలభ్యంతోపాటు.. దేశంలోని పలు నగరాలు మరింత వేగంగా డెవలప్ కావటానికి మూడు రాజధానుల కాన్సెప్టును ప్రొఫెసర్ గాలి వినోద్ తెర మీదకు తెచ్చారు. మరి.. ఈ వాదనకు అధికార టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎలా రియాక్టు అవుతుందో చూడాలి

Leave A Reply

Your email address will not be published.