ఒంటి చెత్తో దేశాలను పాలిస్తున్న మహిళ నాయకురాల్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది. లోక్‌సభ ఆమోదం పొందింది. అయినా, మహిళ పాలన మనకు కొత్తేం కాదు. తరాలుగా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నదామె. స్వాతంత్య్రం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్‌లో మంత్రిగా కొలువైన అమృత కౌర్‌ నుంచి ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు చాలామంది మగువలు దేశానికి ప్రాతినిధ్యంవహించారు. ఇక విశ్వ మహిళలు ఇందిరాగాంధీ, మార్గరెట్‌ థాచర్‌, అంగ్‌సాన్‌ సూకీ, బెనజీర్‌ భుట్టో తమదైన ముద్రతో అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా దేశాధ్యక్షులను కూడా తలుచుకుని తీరాలి.

Leave A Reply

Your email address will not be published.