పార్లమెంట్ లో మహిళా బిల్లు బిసి మహిళలను అనగదొక్కడమే

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్రం తరువాత ఈ దేశంలో దొరలూ పోయే దొరసానుల పాలనా రాబోతుందని బిసి సంక్షేమ సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అద్యక్షులు తట్టే మహేష్ అన్నారు.పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం బిసి మహిళలను అనగా ద్రోక్కడమే నన్నారు.గురువారం ఇక్కడమీడియా సమావేశం లో మాట్లాడుతూ 56 శాతం జనాభా గల బి.సి కులాల బ్రతుకులు ఎలా బాగుపడ్డాయి. బాగుపడడానికి ఎలాంటి చర్చలు తీసుకున్న కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలి. వన్ – నేషన్ – వన్ ఎలెక్షన్ బాగానే యుంది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. అప్పుడే సమాజంలో సామాజిక న్యాయం లభిస్తుంది. లేకపోతే సమాజంలో మార్పు ఉండదని అన్నారు.56 శాతం జనాభా గల బి.సి.ల బతుకుల గురించి పెట్టరా? అని, కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం గత 76 సంవత్సరాలుగా బి.సి లకు రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లు పెట్టాలని ప్రతిపాదించారు. అయితే మహిళా బిల్లులో బి‌సి/ఎస్‌సి/ఎస్‌టి మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరారు.మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు.ఈ సమావేశం లో భూమి పురం ఆంజనేయులు దుర్గాప్ప జగదీష్ నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.