ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేవు

-  కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. బీజేపీకాంగ్రెస్జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. కింగ్‌మేకర్‌ స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం జేడీఎస్ ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయాఅని అడిగినపుడుఅలాంటి అవకాశాలేవీ లేవన్నారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ముఖ్యమంత్రికాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తాను పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూతనకు ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. తనకు 60 శాతం కన్నా ఎక్కువ ఓట్లు లభిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలనిభవిష్యత్తులో తాను ఎన్నికల్లో పోటీ చేయబోననిఅయితే రాజకీయాల నుంచి విరమించుకోబోనని తెలిపారు. పని చేసే పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల్లో ఇమిడి ఉన్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.