ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీసిన గీతను దాటేది లేదు

-  స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను వీర విధేయుడిడని అన్నారు.తన స్థాయికి తగ్గకుండా అవకాశం కల్పిస్తానని, ఇప్పటికంటే ఉన్నతంగా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంయమనం పాటించాలని, సీఎం ఆశీస్సులు మెండుగా ఉంటాయని అన్నారు.

బహిరంగ సభను విజయవంతం చేద్దాం

అక్టోబర్‌ 16న నియోజకవర్గంలోని ధర్మసాగర్‌ మండలం దేవన్నపేట గ్రామ సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఉంటుందని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు చూచించారు. త్వరలోనే నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తానని అన్నారు. అలాగే స్టేషన్‌ ఘన్‌ పూర్‌ను మున్సిపాలిటీగా చేసుకోవడం, నియోజకవర్గ కేంద్రంలో అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.