ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడు

-   కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. దళితులకు భూమి కొనడానికి భూమి లేదని కేసీఆర్ చెప్పారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్‌ను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చారు. కేసీఆర్ అధికారలోకి వచ్చాక ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్‌ను ఎస్సీఎస్టీ డెవలప్‌మెంట్‌గా మార్చారు. దళిత బంధు అనేది హుజూరాబాద్ ఉప ఎన్నికలకు పరిమితం అయింది. ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు ఇస్తామని చెప్పారు కానీ 2022-23 ఆర్థిక సంవత్సరం దాటినా ఇప్పటి వరకు దళిత బంధు ఇవ్వలేదు. దళిత బంధుకు బడ్జెట్‌లో రూ 17,700 కోట్లు పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 2023-24 బడ్జెట్‌లో సైతం దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయింపులు చేశారు కానీ అమలు చేయలేదు. ఒక్క బీసీకి ఆర్థికంగా సహాయం చేయని ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సర్కార్. బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఆర్థిక సహాయం అని ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు ఆర్థిక సహాయం ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు.‘‘మైనారిటీ బంధు ఇస్తున్నామని ప్రభుత్వం జీవో జారీ చేసింది. గడిచిన ఐదేళ్ళుగా మైనారిటీ యాక్షన్ ప్లాన్ ఏమైంది?, గతంలో మైనారిటీలకు రూ.80 వేలు ఇస్తామని జీవో ఇచ్చారు… ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తామని జీవో ఇచ్చారు. దళితబంధుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించాం. ముస్లిం మైనారిటీలకు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే త్యాగం చేశారా?, నిరుద్యోగులుయువత పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. మైనారిటీలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని ధ్వజమెత్తారు.‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కిషన్ రెడ్డి అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కావు. ముస్లిం మైనారిటీల్లో సామాజికంగా వెనుకబడ్డ వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతాం. గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేద్దామంటే కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ చెప్తున్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కేసీఆర్మోదీ ఇద్దరు అలాయ్ బలాయ్. కానీ కేంద్ర సహకరించడం లేదని కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేంద్రం సహకరించకపోతే 2020 వరకు మోదీని కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆర్ ఎందుకు తీసుకురాలేక పోయారు. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును కేసీఆర్ సమర్ధించారు.’’ అని జీవన్‌రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.