చంద్రబాబు అరెస్టులో ఎలాంటి దురుద్దేశాలు లేవు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చంద్రబాబు అరెస్టు విషయంలో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు అరెస్టులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. బలమైన ఆధారాలతోనే సిట్‌ వేశామని, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందని చెప్పారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్ర భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్థిక నేరమని, స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని విమర్శించారు.ఆర్థిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవరం లేదని సజ్జల అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్టున్నారని మండిపడ్డారు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని, రెండేండ్ల క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు నమోదయిందని చెప్పారు. ఈ స్కామ్‌లో బాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు. వ్యక్తిగతంగా కక్ష సాధించే స్వభావం సీఎం జగన్‌ కాదని, దర్యాప్తులో రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెడెండ్లు ఆగారని వెల్లడించారు. దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.