రైతు లేనిదే మెతుకు లేదు.. మెతుకు లేనిది బతుకు లేదు

  సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారానే పరిపూర్ణ  ఆరోగ్యం రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము ప్రేమ్ కుమార్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతు ఆయుష్ పెరుగుతుందని రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్ము ప్రేమ్ కుమార్ అన్నారు. స్థానికంగా యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం వలిగొండ ఉత్పత్తిదారుల సంస్థ లో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ప్రేమ్ సాగర్ యాదవ్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతులకు  అవగాహన కల్పించి ఆహారంతో ఆరోగ్యం నువ్వు కాపాడుకునే విధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అలాగే ఉపాధి హామీ పనులను రైతు వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని .ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయానికి కూలీల కొరత తీవ్రంగా ఉంది దానివల్ల రై తు వివిధ రకాల పంటలను పండించడానికి వెనుకాడుతూ సులభంగా పండించే వరి వైపు మొగ్గుచూపుతున్నారు. ఉపాధి హామీ పనులను రైతులకు అనుసంధానం చేస్తే గతంలో మాదిరిగా అన్ని రకాల పంటలను పండించి రైతు సమగ్ర అభివృద్ధి పొందుతాడని భావిస్తున్నాను అని తెలియజేశారు , రైతు విధిగా గోమాతను ,భూమాతను రక్షించే విధంగా సేంద్రియ వ్యవసాయానికి ముగ్గు చూపాలని ప్రస్తుత పరిస్థితులలో ఆహార కొరత ఏర్పడకుండా కనీసం తను చేసే వ్యవసాయంలో సగం వ్యవసాయాన్ని అయినా సేంద్రియ విధానం ద్వారా పండించాలని సూచించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కోతుల ఇబ్బంది రైతులను చాలా విధాలుగా బాధిస్తుంది అట్టి సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం నాటే సామాజిక అడవులలో పండ్ల చెట్లను అధికంగా నాటి మామూలు కలప చెట్లను నాటకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు .రైతులను కాపాడాలని ప్రస్తుతం ఉన్నటువంటి సబ్సిడీలను పెంచాలని పాల్గొన్న రైతులు అభిప్రాయపడ్డారు. కనీస మద్దతు ధరను పెంచుతూ అలాగే ఎరువుల సబ్సిడీని కొనసాగించాలని రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు బతుకుతూ 100 మందిని బతికిస్తున్నాడు  గోమూత్రం ,గోపెడతో ఆరోగ్యం కాపాడుకోవాలని నాటి కాలంలో 110 సంవత్సరాలు సగటు మనిషి జీవితకాలం ఉన్నది కానీ నేటి కాలంలో 20 నుండి 60 సంవత్సరాల వరకే గడిచిపోతున్నారు వివిధ రకాల జబ్బులతో గుండెపోటు షుగర్ నరాల బలహీనత రకరకాల జబ్బులతో మరణిస్తున్నారు . ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి మనిషి యొక్క ఆయుష్షుని పెంచుకోవాలని ఆయన సూచించారు సేంద్రీయ వ్యవసాయ పద్ధతి ద్వారా నాటి కాలంలో పండించిన రైతుల పంటలు రాగులు, కొర్రలు ,జొన్నలు ,సజ్జలు ,చిరు ధాన్యాలు తదితర పంటలు వేసుకుని జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని ఆయన సూచించారు. కేసముద్రం రైతు ఉత్పత్తిదారుల సంస్థ  డైరెక్టర్ సంకు  శ్రీ పాల్ రెడ్డి , వేముల వెంకటేశ్వర రెడ్డి, గండి శ్రీనివాస్, ఆకుల సుధాకర్ ,తోట నాగన్న, బండి శ్రీనివాస్, చాగంటి శ్రీనివాస్ ,బండి వెంకన్న,సంస్థ  సీఈఓ సంతోష్  తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.