సలహాదారుల నియామకంతో రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల నియామకం జరుగుతుందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… సలహాదారుల నియామకంతో రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదన్నారు. తప్పుడు సలహాలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాను దోచేందుకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వాటిని బయటపడకుండా ఉంచేందుకు ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందినా తిరిగి నియమిస్తున్నారని అన్నారు. సలదారుల నియామకం రాజకీయ నియామకాలే అని వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాఖలను ఏర్పాటు చేసేందుకే వీరిని ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్‌లతో ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వీరందరినీ తొలగిస్తామని తెలిపారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో మున్సిపల్‌శాఖ పరిధిలో మ్యాన్‌హోల్‌లో చావులు, కూలుతున్న, కాలుతున్న భవనాలే దర్శనం ఇస్తున్నాయన్నారు. మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్‌తో విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మార్చారన్నారు. పేపర్ లీకేజ్‌లో మూడు ప్రధాన డిమాండ్‌లతో రేపు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.