ఎన్నికల్లో పొత్తులుండవు… 119 స్థానాలకు పోటీ చేస్తాం…

- బిఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు  పాటుపడుతున్నాయి... - తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పి వినయ్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  జులై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోను పొత్తులుండవని ఆ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పి.వినయ్ కుమార్ స్పష్టం చేశారు.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఫిల్మ్ నగర్ లోని ప్రశాషన్ నగర్ లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ జండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ దాదాపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత వేగంగా నిర్వహిస్తున్నామని, క్షేత్ర స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడమే తరువాయన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బద్దలు కొట్టడానికే తమ పార్టీ ఆవిర్భావించిందని, బిఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎస్సిని ముఖ్యమంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తప్పితే, ఎస్టీని ముఖ్యమంత్రి ని చేస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయటమే తెలంగాణ సమాజ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బిసిల పేరేత్తడానికే తెలంగాణ ప్రధాన పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని ఆయన వాపోయారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని వినయ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పించటంతో పాటు రాజ్యాధికారంలో మహిళలను భాగస్వాములను చేయడం, రైతుల సంక్షేమాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ సమాజ కాంగ్రెస్    పని చేస్తుందని డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ స్పష్టం చేశారు.అంతకు ముందు తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం, టి ఎస్ పి వెబ్ సైట్ ను వినయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వినయ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.నరహరి, రామక్రిష్ణ, వెంకట్ రెడ్డి, గౌతమ్, గంగాధర్, శ్రీ హరి, లక్ష్మణ్, బాలాచారి, శేఖర్ గౌడ్, సురేష్, అనికేత్, నవీన్, విజయ్ తదితరులు పాల్గొనగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.